
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్-2026లో తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఫిఫా ప్రపంచకప్‌లో అర్థరాత్రి నుంచి ఇప్పటివరకూ ఆరు మ్యాచులు జరిగాయి. అందులో జోర్డాన్‌తో అర్జెంటీనా తలపడింది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన మెస్సీ.. ఈ మ్యాచ్‌లో గోల్ కొట్టి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ పోటీల్లో వరుసగా ఏడు మ్యాచుల్లోనూ గోల్ కొట్టిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటికే నాకౌట్‌కు చేరుకున్న అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయం సాధించింది. గ్రూప్ J నుంచి తలపడిన అల్జీరియా - ఆస్ట్రియా మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. దీంతో అర్జెంటీనాతో పాటు ఈ రెండు జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి.









