
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మే 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వరక్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిలమ్స్, ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.












