
మన తెలంగాణ/కుబీర్: మహారాష్ట్ర సరిహద్దులో ని హుడీ గ్రామం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బీ) గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డా రు. పార్డీ (బీ)కి చెందిన పలువురు భక్తులు మహారాష్ట్రలోని సహస్రకుండ్ పుణ్యక్షేత్రం దర్శనానికి జీపులో వెళ్లి తిరిగివస్తుండగా హుడీ సమీపంలో జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనతో పార్డి (బీ)లో విషాదఛాయలు అలుముకున్నాయి.











