నవతెలంగాణ-మద్నూర్ రోజు రోజకు ఎండలు మండి పోతున్నాయి. వేసవి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడున్న ఎండలు మునుపెన్నడూ లేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే ఇక రాబోయే మే నెలలో ఎండల వేడి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మద్నూర్ లో మంగళవారం 44 డిగ్రీల ఎండ నమోదయ్యింది.
The post మద్నూర్ లో మండుతున్న ఎండలు appeared first on Navatelangana.








