కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రికి 20 ఏండ్ల జైలుశిక్ష పడింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... షాబాద్ మండలంలోని కుర్వగూడ గ్రామానికి చెందిన దాదే రాజు (37) తన కన్న కూతురిపై 12-.10.-2024న లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు ప్రక్రియలో భాగంగా దర్యాప్తు అధికారి అయిన షాబాద్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కాంతారెడ్డి మౌఖిక, లిఖితపూర్వక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి, సాక్షులను విచారించి, కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితుడిపై మోపిన నేరాలకు గాను న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది.