చిట్టగాంగ్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. ఉదయం నుంచే వర్షం మొదలైంది. ఆట ప్రారంభం అయ్యే సమయానికి అది మరింత పుంజుకుంది. భారీ వర్షం వల్ల మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ కూడా పరిస్థితి లేకుండా పోయింది.

పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ప్రస్తుతం 10 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక చివరి టి20లో న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తోంది. శనివారం ఈ మ్యాచ్ ఢాకాలో జరుగనుంది. ఇంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా బంగ్లాదేశ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.