
మన తెలంగాణ/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండ ల్లో రైతుల గుండెలు ఆగిపోతు న్నా.. ఈ కర్కశ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదా..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.పంటలు కొనకుండా ఇంకెంత కాలం యాతన పెడతారు.. ఇంకెన్ని చావులు కావాలి.. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం కు ప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు...రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభు త్వ వ్యవస్థలు..రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల చావులను చూసి ముఖ్యమంత్రి ఆనందిస్తున్నరా..? అని ప్రశ్నించారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి..పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.













