
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పు ణ్యక్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యా ల నడుమ నిర్వహించిన వేద పాఠశాల భూమి పూజ కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి యాదగిరిగుట్టలోని పెద్దగుట్టపైకి చేరుకొని సంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేద పాఠశాలకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితు ల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యే క పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక హోమం నిర్వహించగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సిఎం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన రూ. 99.55 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కొండా సురే ఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చా మల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
దేవస్థాన అభివృద్ధిలో భాగంగా సి ఎం పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. రూ.43.80 కోట్ల తో వేద పాఠశాల నిర్మాణం, రూ. 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం, రూ.1.41 కోట్లతో వైకుంఠద్వారం నుం చి కొండపైకి వెళ్లే మెట్ల మా ర్గానికి పైక ప్పు నిర్మా ణం, రూ. 1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణం, రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాళ్లు, దీక్షాపరులు సదనం నిర్మాణం చేపట్టనున్నారు.
పూర్ణకుంభ స్వాగతం
పెద్దగుట్టపై భూమి పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి కొండపైకి చేరుకున్నారు. తూర్పు రాజగోపురం మార్గంగా ఆలయంలోకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనాల మధ్య సీఎం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రెండు గంటలకుపైగా యాదగిరిగుట్టలో సీఎం
సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు పైగా యాదగిరిగుట్ట లో గడిపారు. ఉదయం 08:42 గంటలకు పెద్దగు ట్ట మీద ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 09.23కు వేద పాఠశాల శంకుస్థాపన స్థలం వద్దకు చేరుకొని, 9:37 గంటలకు ముహూర్తం ప్రకారం శంకుస్థాపన నిర్వహించారు. 9:41 గంటలకు అక్క డ ఏర్పాటుచేసిన 5 అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. 09:44 గంటలకు పూజ స్థలి వద్ద కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేం ద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. 09:52 గంటలకు కాన్వాయ్ ద్వారా పెద్దగుట్ట నుం చి యాదగిరిగుట్ట ప్రధానాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం 10:56కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.












