
యలమంచిలి: ఒక కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చమగోదవావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ బడ్డీకొట్టు నిర్వహిస్తుంటారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం చించినాడ బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకారు. ఈ ఘనలో శ్రీనివాస్ భార్య పద్మినిని జారార్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వ్, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి చేరిన పద్మినిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతైన వార కోసం గాలింపు చర్యలు చేపట్టారు.











