గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఎన్‌బికె111’ మూవీ కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా‘ ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. ఈ సినిమా నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.