
వేసవి కాలంలో చెరకు రసం ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి అందరూ దీనిని తాగడానికి ఇష్టపడుతుంటారు. ఈ జ్యూస్ శరీరానికి తాజాదనాన్ని ఇస్తుందని, దానిలోని ఫైబర్ ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరకు రసాని తాగకూడదని హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్, రక్తంలో అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే? ఈ రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని అకస్మాత్తుగా పెంచుతుంది. కాబట్టి చెరకు రసం తాగితే మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
అంతేకాకుండా, అధిక బరువు ఉన్నవారు కూడా చెరకు రసాని తాగడం మానుకోవాలి. ఫలితంగా చెరకు రసంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలను కూడా వేగంగా పెంచుతాయి. కాబట్టి ఈ రెండూ అధిక బరువు ఉన్న వ్యక్తులకు మంచివి కావు. అలా అని ఊబకాయం ఉన్నవారు చెరకు రసాన్ని అస్సలు తాగకూడదని అర్థం కాదు. వారానికి ఒక గ్లాసు చెరకు రసం తాగవచ్చు.
తరచుగా అజీర్ణం, కడుపు నొప్పి లేదా అధిక గ్యాస్‌తో బాధపడేవారు కూడా చెరకు రసం తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ రసం కడుపు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, చెరకు రసం తాగేవారు దీనిని అధిక పరిమాణంలో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఖాళీ కడుపుతో కూడా తాగకుండా జాగ్రత్త వహించాలి.



