
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మేకర్స్ రెండో షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనదైన చరిష్మాతో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, ‘ధర్మన్’ చిత్రం ద్వారా నిర్మాత, నటుడిగా మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్,ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రాన్, రాశీ ఖన్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డిస్నీ సంస్థ దీనికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.











