
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. జూన్ 30వ తేదీనే ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్లు వయస్సు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే.. అది వర్తిస్తుంది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెలంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు.
ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో ఆయన పూర్వ విద్యార్థి. 1986లో ఆయన సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఆర్మీకి ఆయన సేవలు అందిస్తున్నారు. విస్త్రత శ్రేణి కమాండ్, స్టాఫ్, లాంటి పలు వ్యూహాత్మక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ధీరజ్ సేథ్ సాయుధ రెజిమెంట్, బ్రిగేడ్ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పని చేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జివొసిగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024లో బాధ్యతలు స్వీకరించారు.











