హైదరాబాద్: తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు భారీ కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ వనలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కొద్దిసేపు వర్షం పడినా.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పాడి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. వర్షాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు హై అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీస్‌, ట్రాఫిక్‌ పోలీస్‌, మున్సిపల్‌, హైడ్రా, విద్యుత్‌, వాటర్‌ బోర్డ్‌, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.

ఇదిలావుంటే, భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ.