
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సోమవారం ఒక మహిళను ఉద్దేశించి, సమ్మతితో ఉన్న సంబంధంలో నేరం అనే ప్ర శ్న ఎక్కడుంది? అని ప్ర శ్నించింది. తప్పుడు వివాహ హామీతో లైంగిక దాడి చేశాడం టూ తన మాజీ సహజీవన భాగస్వామిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వును ఆమె స వాల్ చేసింది. న్యాయమూర్తులు బి.వి. నాగర త్న, ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చాలా కాలం పాటు కలిసి నివసించారని, వారికి ఒక సంతానం కూడా ఉందని ధర్మాసనం గమనించింది. వీరిరువురూ కలిసి జీవించారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది. వివాహం జరగలేదని ఇప్పుడు లైంగిక దాడి అంటున్నారు. 15 సంవత్సరాలు కలిసి జీవించారు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. మహిళ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆమె భర్త మరణించిన తర్వాత తన బావ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పరిచ యం ఏర్పడిందని తెలిపారు.
వివా హం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించాడని కోర్టుకు వివరించారు. దీనిపై జస్టి స్ నాగరత్న స్పందిస్తూ, అయితే వివాహానికి ముందే ఎందుకు అతని తో కలిసి జీవించింది? అని ప్రశ్నించా రు. ఆమె అతనితో కలిసి సహజీవనం చేసిం ది. అతనితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చట్టబద్ధమైన వివాహ బంధం లేకపోవడంతో అతను వెళ్లిపోయాడు. సహజీవన సంబంధాల్లో ఇదే ప్రమాదం. ఒకసారి అతను వెళ్లిపోయిన తర్వా త అది క్రిమినల్ నేరంగా మారదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళ తర ఫు న్యాయవాది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పటికే వివాహితుడని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెట్టాడని తెలిపారు. దీనిపై జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, వివాహం జరిగి ఉంటే ఆమెకు ప్రశ్నించే హక్కు బలంగా ఉండేది. రెండో పెళ్లి అని కేసు పెట్టే అవకాశం ఉండేది. భరణం కోరే హక్కు ఉండేది. ఇప్పుడు వివాహం లేకుండా కలిసి జీవించారు. ఇదే సహజీవన సంబంధాల్లో ఉన్న ప్రమాదం.
ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు. ఇప్పుడు మేమేం చేయాలి? అని వ్యాఖ్యానించారు. అయితే చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరిష్కార మార్గాలను పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. అతను జైలుకు వెళ్లినా ఆమెకు ఏమి లాభం? చిన్నారికి భరణం లేదా ఆర్థిక పరిహారం గురించి ఆలోచించవచ్చు. బిడ్డకు ఇప్పుడు ఏడేళ్లు. కనీసం పిల్లవాడి కోసం కొంత ఆర్థిక సహాయం అందించవచ్చు అని జస్టిస్ నాగరత్న అన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, సదరు మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మధ్య రాజీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది.











