మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పె ట్టుబడులను మరింతగా ఆకర్షించేలా డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లో బల్ సమ్మిట్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో

సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీ సుకోవాలన్నారు. గతేడాది నిర్వహించిన గ్లో బల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.