
డంబుల్లా: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఒక ఓవర్‌ని కుదించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66 అర్థ శతకాలతో ఆట్టుకున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో త్వరగా ఔటైన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు. 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. మరోవైపు ప్రభ్ సిమ్రన్ నిలకడగా ఆడుతూ.. అవకాశం దొరికినప్పుడు దూకుడుగా ఆడాడు. ఇక తిలక్ వర్మ, రుతురాజ్‌లు మాత్రం చెలరేగిపోయారు. ఆఖర్లో సూర్యాంశ్ షెడ్జే (40), అనుకుల్ రామ్ (16 నాటౌట్) వేగంగా ఆడారు. కానీ, స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో భారత్ 350+ మార్క్‌ను దాటలేకపోయింది. ఇక అఫ్గాన్ బౌలింగ్‌లో అబ్దుల్లా 5, సాఫి 3, ఇమ్రాన్ ఒక వికెట్ తీశారు.












