
న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో అభిమానులను తరచూ అవాక్కయ్యేలా చేస్తుంటాడు. అసాధ్యమైన క్యాచ్‌లను అందుకొని ఫీల్డింగ్‌లో తనకు తానే సాటి అని చాటి చెబుతూ ఉంటాడు. తాజాగా ఓ క్యాచ్‌తో మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిలిప్స్ గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో బ్యాటర్ సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. మెరుపు వేగంతో దూసుకొచ్చి సిక్సర్‌గా వెళ్లే ఆ బంతికి చేయి అడ్డుపెట్టాడు. ఈ క్రమంలో అద్భుత రీతిలో క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత తానే ఈ క్యాచ్ పట్టాన అన్నట్లు ఆశ్చ్యానికి గురయ్యాడు.
Glenn Phillips! Stop That! 🤯🤯🤯
— CPL T20 (@CPL) September 1, 2026
A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U











