సిడ్నీ: ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ సెమీ ఫైనల్‌లో టాప్ సీడ్ యమగుచి (జపాన్) చేతిలో సింధు ఓటమిపాలైంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన యమగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో సింధు పరాజయం చవిచూసి ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో చాలాసేపు సింధు ఆధిక్యంలో ఉంది. కానీ, యమగుచి పట్టువదలకుండా పోరాడటంతో స్కోర్ 20-20గా సమం అయింది. ఆ తర్వాత యమగుచి వరుసగా రెండు పాయింట్ల సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో యమగుచి జోరు ముందు సింధు తేలిపోయింది. దీంతో ఈ సెట్‌లోనూ యమగుచి సునాయాసంగా విజయం సాధించింది.