అసెంబ్లీ ఎన్నికలో విజయంతో పుదుచ్చేరిలో తిరిగి ఎన్ రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రశాంత మృధుస్వభావిగా పేరొందిన రంగ స్వామి ఐదోసారి సిఎం కావడానికి రంగం సిద్ధం అయింది. ఎన్నికలలో ఎఐఎన్‌ఆర్ సారధ్య ఎన్‌డిఎ ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం సంతరించుకుంది.

ఎఐఎన్‌ఆర్‌సి పది స్థానాలను, బిజెపి 4 , అన్నాడిఎంకె , ఎల్‌జెకె, ఇతర ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలకు ఒక్కో స్థానం చొప్పున దక్కింది. 30 మంది సభ్యుల అసెంబ్లీలో ఇప్పుడు కూటమికి 18 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 16. దీనిని కూటమి అధిగమించడంతో తిరిగి సిఎంగా పగ్గాలు చేపట్టేందుకు రంగస్వామి సిద్ధం అయ్యారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రంగస్వామి పార్టీ వీడి 2008లో ఎఐఎన్‌ఆర్‌సి స్థాపించారు. సౌమ్యుడుగా పేరొందిన రంగస్వామి పార్టీ బిజెపికి అనుకూలంగా ఉంటూ ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షం అయింది.