ఢిల్లీ క్యాపిటల్స్ కి ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లుతున్న వేళ మరో పెద్ద సమస్య ఎదురైంది. జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఘోర ఫామ్‌లో ఉండటంపై మాజీ భారత ఆటగాడు సుబ్రమణియం బద్రీనాథ్ తీవ్ర విమర్శలు చేశారు.
10 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసుకున్న కుల్దీప్, ఓవరుకు 10కిపైగా పరుగులు ఇచ్చాడు. దీనిపై స్పందించిన బద్రినాథ్, కుల్దీప్‌ను సరైన సమయంలో బౌలింగ్‌కు తీసుకురావడంలో కెప్టెన్ అక్షర్ పటేల్ విఫలమయ్యాడు. ఒక మ్యాచ్‌లో 20వ ఓవర్ కూడా అతడితో వేయించాడు. కెప్టెన్‌గా అక్షర్ అతడిని సరిగా వినియోగించలేదు అని విమర్శించారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మాత్రం కుల్దీప్‌కు అండగా నిలిచాడు. అతడిని ఎదుర్కోవడం నాకు ఇష్టం ఉండదు.అంతటి స్కిల్ ఉన్న మ్యాచ్ విన్నర్ అతడు. ప్రతి ఆటగాడికీ చెడు రోజులు వస్తాయి అంటూ మద్దతుగా మాట్లాడాడు.
నాలుగు వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ పై గెలిచి ప్లేఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.















