టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు… కానీ ఈసారి కారణం క్రికెట్ కాదు! ఒక వైరల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. విరాట్ కోహ్లీకి సంబంధం ఉన్న మహిళల ఫోటోలతో ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కొలాజ్ క్రియేట్ చేసింది. అందులో అతడి భార్య అనుష్క శర్మ, మాజీ ప్రేయసి ఇజాబెల్, జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్, అలాగే నటి అవ్నీత్ కౌర్ ఫోటోలు ఉన్నాయి.
“గ్రౌండ్ లోపల, బయట… ఏదీ వదలడు కోహ్లీ! అమ్మాయిలపై ఆయన టేస్ట్ సూపర్!” అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఈ పోస్ట్ చూసిన ఇజాబెల్ మాత్రం అసహనం వ్యక్తం చేసింది. “కోహ్లీతో రిలేషన్ ముగిసి 12 ఏళ్లు అయ్యింది… ఇంకా ప్రజలు దీన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు?” అంటూ కామెంట్ చేసింది. ఆమె స్పందనకు నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.
అయితే 2012 నుంచి 2014 వరకు కోహ్లీ, ఇజాబెల్ రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో కోహ్లీ, అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పుడీ ఈ వైరల్ పోస్ట్… అలాగే ఇజాబెల్ రియాక్షన్… సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారాయి.












