కేరళ పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్‌లో పరిశ్రమలకు అందిస్తున్న అన్ని ప్రయోజనాలను ఇకపై పర్యాటక రంగానికీ వర్తింపజేస్తామని ప్రకటించారు.
పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలన్న ఎన్నాళ్లనో ఉన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు.
కేరళను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం కీలకమని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నాయి.














