అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల నమోదు భారీగా పడిపోయింది. తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది స్ప్రింగ్ సెమిస్టర్‌లో విదేశీ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల అడ్మిషన్లు గత ఏడాదితో పోలిస్తే సగటున 20 శాతం తగ్గాయి. గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ తగ్గుదల 24 శాతానికి చేరింది.

విదేశీ విద్యార్థులే యూనివర్సిటీలకు ప్రధాన ఆదాయ వనరు కావడంతో.. ఈ తగ్గుదల ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. గతంలో అధికారులు విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేయడం, వేలాది మంది విద్యార్థుల లీగల్ స్టేటస్ రద్దు చేయడం వంటి ఘటనలు భయాందోళనలు పెంచాయి.

అంతేకాదు.. గత ఏడాది వేసవిలో స్టూడెంట్ వీసాల జారీ 36 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే.. ఫాల్ సెమిస్టర్‌లో నమోదు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.