గ్రాండ్ క్యానియన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సందర్శ్ కృష్ణ మృతి చెందాడు. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్న 26 ఏళ్ల సందర్శ్ కృష్ణ మృతదేహాన్ని 10 రోజుల గాలింపు అనంతరం అధికారులు గుర్తించారు. గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్‌లోని సౌత్ రిమ్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది.
ఏప్రిల్ 27 నుంచి 28 మధ్య చివరిసారిగా రిమ్ ట్రెయిల్ వద్ద కనిపించిన సందర్శ్, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ విద్యార్థులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.












