కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా హైవేపై పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌లో ఉన్న వేల లీటర్ల పాలు రోడ్డుపైకి భారీగా లీకయ్యాయి. దీంతో హైవేపై ఎక్కడ చూసినా పాలే కనిపించింది.

పాలు రోడ్డుపైకి రావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బకెట్లు, క్యాన్లు, ఇతర పాత్రలు తీసుకొచ్చి రోడ్డుపై ప్రవహిస్తున్న పాలను సేకరించేందుకు ప్రయత్నించారు. భారీ మొత్తంలో పాలు వృథా కావడంతో గణనీయమైన ఆర్థిక నష్టం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు గుమిగూడటంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.