పెట్రోల్ ధరల పెంపుపై మరోసారి కేంద్రమంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ పరిపాలనలో పారదర్శకత, వేగం పెంచేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో భారీ సంస్కరణలు చేపడుతున్నామని పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 46 శాఖలను ఒకే చోటికి తీసుకురావడంతో ప్రభుత్వ ఖర్చులు తగ్గి, శాఖల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్పారు. దీంతో వ్యాపార అనుమతులు మరింత వేగంగా లభిస్తాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగినా దేశ ప్రజలపై భారం పడకుండా మోదీ ప్రభుత్వం రక్షించిందన్నారు. భారత్‌ ఎగుమతుల రంగంలో ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకెళ్తోందని చెప్పారు. అలాగే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక పురోగతి సాధించామని, దీనివల్ల భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో మరింత అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.