ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో EPFO 3.0 వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త విధానంతో పీఎఫ్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా సభ్యులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న UPI, ATM ద్వారా PF విత్‌డ్రా సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సేవలకు సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే పూర్తైంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలోని నిధులను క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.
యూపీఐ, ఏటీఎం సౌకర్యాల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. అలాగే ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వైద్యం, విద్య, వివాహం వంటి అవసరాలకు 72 గంటల్లోపు నిధులు పొందే అవకాశం కల్పిస్తున్నారు.
ఇక ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్, ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఓటీపీ ఆలస్యాలు, కాగితపు పనులు తగ్గనున్నాయి. ప్రత్యేక EPFO ATM కార్డులు కూడా అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.












