సమ్మర్ వచ్చిదంటే చాలూ ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఈ ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్‌లు వాడుతుంటారు. అయితే ఇలానే ఓ వ్యక్తి ఆఫీస్‌ నుంచి వచ్చి ఇంట్లో ఏసీ ఆన్‌ చేద్దామని వెళ్లాడు. కానీ అప్పుడే అతని ఏసీ నుంచి ఏదో కదులుతున్నట్టు కనిపించింది. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే పాము కనిపించే సరికి కంగుతిన్నాడు. వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి వాటిని తొలగించాడు.