రంగురంగుల పించం, సుందరమైన రూపంతో చూడ్డాన్ని అందంగా కనిపించే నెమళ్లు విషపూరితమైన పాములను సైతం భయపెట్టగలదని మీకు తెలుసా? అవును ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్న ఓ వీడియోనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అడవిలో వెళ్తున్న ఓ నెమలికి సడెన్‌గా ఓ నాగుపాము ఎదురైంది. అప్పుడు ఆ నెమలి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి.. మళ్లి తిరి వెనక్కి వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.