రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య పేద కుటుంబంలో వెలుగులు నింపాల్సిన 11 ఏళ్ల చిరునవ్వు, పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు వాతపడింది. కేవలం జ్వరం అనుకుని సాధారణ చికిత్స చేయించిన ఆ కుటుంబానికి, తమ బిడ్డకు 'రేబిస్' సోకిందనే నిజం తెలిసి కోలుకోలేని షాక్‌కు గురయ్యారు.