మీరు ఇంకా బంగారం, వెండి రేట్ల గురించే చర్చిస్తున్నారా..? అయితే మీరు ఒక పెద్ద అప్‌డేట్‌ను మిస్ అవుతున్నట్టే.. ఒకప్పుడు ఇంటి సామాన్లకే పరిమితమైన అల్యూమినియం.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో నాలుగేళ్ల రికార్డులను తిరగరాస్తూ.. కిలో రూ.375 మార్కును తాకిన ఈ లోహం.. ఇన్వెస్టర్లకు బంగారు బాతులా మారింది.