Vaibhav Sooryavanshi Century: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక 15 ఏళ్ల బాలుడు విధ్వంసం సృష్టించాడు. జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.