అమెరికాలోని అరిజోనాలో భారీ వరదలు ఓ 20 ఏళ్ల యువతిని మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లాయి.
వరద నీటితో ఉప్పొంగుతున్న ఓ వంతెనను సైకిల్‌తో దాటేందుకు ప్రయత్నించిన యువతి.. ఒక్కసారిగా ఉధృతమైన ప్రవాహంలో చిక్కుకుంది.
సైకిల్‌తో సహా ఆమెను వరద ప్రవాహం ఓ టన్నెల్‌లోకి లాక్కెళ్లింది. అక్కడి నుంచి దాదాపు 100 అడుగుల దూరం కొట్టుకెళ్లిన తర్వాత.. నీరు ఆమెను బయటకు విసిరేసింది.
అప్పటికే యువతి అపస్మారక స్థితిలో ఉంది.
వెంటనే స్పందించిన వారు ఆమెకు CPR అందించారు. దీంతో కొద్దిసేపటికే యువతి తిరిగి స్పృహలోకి వచ్చింది. సకాలంలో అందిన CPRతో.. మృత్యువు అంచుల నుంచి ఆ యువతి ప్రాణాలతో బయటపడింది.












