సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న “నవత భూమ్” కంటైనర్ షిప్‌ హూగ్లీ నదిలో ప్రమాదానికి గురైంది. డైమండ్ హార్బర్ వైపు వెళ్తుండగా.. నౌకను నిర్దేశిత ఛానల్‌లో ఉంచేందుకు ప్రయత్నించిన సమయంలో స్టీరింగ్‌ నియంత్రణ కోల్పోయింది.

హైటైడ్‌ కారణంగా నదిలో బలమైన ప్రవాహాలు ఏర్పడటంతో నౌకను అదుపులోకి తీసుకురావడం కష్టమైంది. దీంతో నౌక ఛానల్‌ నుంచి పక్కకు వెళ్లి నది ఒడ్డును ఢీకొని గ్రౌండింగ్‌కు గురైంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు, నౌకకు జరిగిన నష్టం తదితర అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.