మిస్ ఇండియా 2026 పోటీలు విజయవంతంగా జరిగాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సైల్‌ విన్నర్‌గా నిలిచారు. మొత్తంగా 30 మంది మోడల్స్‌ను ఓడించి మరీ ఈమె విజేతగా నిలిచింది. ఇంతకీ సాధ్వి సైల్‌ ఎవరు? ఆమె ఈ ఘనత ఎలా సాధించి తెలుసుకుందాం..!

https://api.todaytelugu.net/media/2026/04/349b866faba6ded702f2974635c4f641.webp

మిస్ ఇండియా 2026 కిరీటం సాధ్వి సతీశ్ సైల్‌ను వరించింది. దేశవ్యాప్తంగా 30 మంది మిస్ ఇండియా వరల్డ్ కోసం పోటీ పడగా సాధ్వీ విజేత టైటిల్ సొంతం చేసుకున్నారు. రన్నరప్ గా మహరాష్ట్రాకు చెందిన రాజనందిని పవార్, సెకండ్ రన్నరప్ గా జమ్ము కాశ్మీర్ కి చెందిన అధ్వైత నిలిచారు. నిఖితా పౌర్వాల్, రేఖా పాండే, ఆయుషి ధోలకియా వంటి గత మిస్ ఇండియా విజేతల సమక్షంలో ప్రస్తుత విజేతలకు కిరీటధారణ జరిగింది.

ఇక సాధ్వి సతీశ్ విషయానికొస్తే, ఆమె గోవాకు చెందిన మోడల్, ఎంట్రప్రెన్యూర్‌. సాధ్వి సతీశ్ సైల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది మాత్రం గోవాలోనే. సాధ్వి పాల్గొన్న ప్రధానమైన తొలి అందాల పోటీ పేరు ‘ఐరిస్ ఫేస్ ఆఫ్ చెన్నై’. ఇది 2024 అక్టోబరు 21న చెన్నైలో జరిగింది. ఇందులో ఆమెను క్వీన్ కిరీటం వరించింది.

తాజాగా 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల కోసం 23 రోజుల ముందు(మార్చి 26) నుంచే ఆమె ప్రాక్టీస్‌ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నిపుణుల నుంచి సలహాలను పొందారు. చివరకు సాధ్వి శ్రమ ఫలించింది.

కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఎకనామిక్స్, అంతర్జాతీయ సంబంధాలు అనే రెండు కోర్సుల్లో సాధ్వి పీజీలు చేశారు.

సాధ్వి 7 భాషలు మాట్లాడగలరు. ఆమెకు ఇంగ్లిష్, హిందీ, కొంకణి, మరాఠీ, కన్నడ, స్పానిష్, పోర్చుగీస్ భాషలు వచ్చు. ఆమె కేవలం మూడేళ్లలోనే 10 దేశాల్లో ఒంటరిగా పర్యటించారు.

https://api.todaytelugu.net/media/2026/04/e243ba0f7196cd32a0449c810d0beff9.webp

సాధ్వి ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టి చాలా తక్కువ టైంలోనే 10 కేజీల బరువు తగ్గారు.

కాలిఫోర్నియా బ్యూరిటో లాంటి బ్రాండ్ల తరఫున ప్రచార తారగానూ సాధ్వి వ్యవహరిస్తున్నారు.చకొంత కాలం క్రితమే ఆమె నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.

ఇక వచ్చే ఏడాది మిస్ వరల్డ్ పోటీలో సాధ్వీ ఇండియ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. సాధ్వి తెలివి తేటల నేపథ్యంలో ఆమె భారతదేశానికి మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలుచుకు వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.