అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర టెక్సాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో జూన్ 21, ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇర్వింగ్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా (1201 Hidden Ridge, Irving, TX 75038) వేదికగా ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

భారత కాన్సులేట్ జనరల్, హ్యూస్టన్ భాగస్వామ్యంతో, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ డీసీ మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఇర్వింగ్ నగర మేయర్ అల్ జపాటా ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.

“యోగ ఫర్ హ్యూమానిటీ” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ వేడుకలో యోగా సాధన ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సామాజిక సామరస్యంపై అవగాహన కల్పించనున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొని యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచితంగా యోగా మ్యాట్లు అందించడంతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. పాల్గొనదలచిన వారు ముందస్తుగా ఉచితంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

1000233304.jpg