కన్నడ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకోగా, సినిమా నిడివికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ రన్‌టైమ్ మూడు గంటలకు పైగానే ఉండనుంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలోని కథను పూర్తిస్థాయిలో ఆవిష్కరించేందుకు దర్శకురాలు ఎక్కువ నిడివిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. యశ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా ‘టాక్సిక్’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.












