ప్రేమకథలు చాలానే చూశాం.. కానీ ప్రేమలో పడటం నుంచి దూరమైన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు మనతోనే ఉండటం అనే ఎమోషన్‌ను చూపించే మూవీగా ‘సహా: లైఫ్ ఆఫ్ సంజు’ ఆసక్తి పెంచుతోంది. శివకుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ జంటగా నటించిన ఈ సినిమాకు నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. తేజ వెల్పుచెర్ల నిర్మించారు.
స్కూల్ డేస్‌లో అనుకోకుండా కలిసిన ఇద్దరు.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత టైమ్ మారుతుంది.. పరిస్థితులు మారుతాయి.. కానీ వాళ్ల మధ్య ఉన్న జ్ఞాపకాలు మాత్రం మారవు. ఇదే కాన్సెప్ట్‌తో ‘సహా’ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. “వారు అనుకోకుండా కలిశారు.. ప్రేమలో పడ్డారు.. వారి జ్ఞాపకాలు ఒకరి జీవితంలో మరొకరి భాగమయ్యాయి” అనే లైన్ మూవీ ఫీల్‌ను చాలా సింపుల్‌గా చెప్పేస్తోంది.
ట్రైలర్‌లో శివకుమార్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. వేర్వేరు టైమ్‌లైన్స్‌లో ఆయన చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్వేత లక్ష్మణ్‌తో కెమిస్ట్రీ కూడా నేచురల్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరి పెర్ఫార్మెన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. శేఖర్ చంద్ర BGM ట్రైలర్‌లోని ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.
మొత్తానికి లవ్, లాంగింగ్, బ్రేకప్, దూరం, జ్ఞాపకాలు.. ఇలా ప్రేమలోని అన్ని షేడ్స్‌ను టచ్ చేస్తూ ‘సహా’ ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ట్రైలర్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడంతో పాటు.. అసలు కథను థియేటర్లలో చూడాలనే ఆసక్తిని కూడా పెంచుతోంది. సెప్టెంబర్ 4న ‘సహా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.









