ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచెకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. గెదెలరాజు – కాకినాడ తాలూకా చిత్రానికి గాను ఆయన ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, టూరిజం & కల్చర్ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ చేతుల మీదుగా రఘు కుంచె ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
సంగీత రంగంలో తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న రఘు కుంచెకు ఈ అవార్డు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. గెదెలరాజు – కాకినాడ తాలూకా చిత్రానికి ఆయన అందించిన సంగీతానికి ఈ పురస్కారం దక్కడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా అవార్డును అందుకున్న రఘు కుంచె.. తన సంగీత ప్రయాణంలో ఈ గౌరవం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మంచి సంగీతాన్ని అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.









