హీరోయిన్ సమంత రూత్ ప్రభుతన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఆమె తన భర్త, దర్శకనిర్మాత రాజ్ నిడిమోరు, దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి , నటి శ్రీముఖితో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు పొందారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విజయవంతం కావాలని కోరుతూ ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం. విడుదలకు ముందు ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం పలు ఆలయాలను కూడా సందర్శిస్తోంది.


















