అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య వివాదానికి ముగింపు పలికే ఒప్పందం కుదిరిందని ప్రకటించడంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. డౌ జోన్స్ సూచీ 607 పాయింట్లు లేదా 1.2 శాతం పెరిగి కొత్త ఇంట్రాడే రికార్డును తాకగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.3 శాతం, నాస్‌డాక్ 2.2 శాతం లాభపడ్డాయి.
ఇరాన్‌తో ఒప్పందం పూర్తయిందని ట్రంప్ ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆశావాదం పెరిగింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ తెలిపారు.
అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ట్రంప్ అనుమతి ఇవ్వడంతో చమురు ధరలు తగ్గాయి. దీంతో మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది.
ఇక స్పేస్‌ఎక్స్ షేర్లు మరో 6 శాతం ఎగిసి, కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లను దాటింది.










