తెలుగు రాష్ట్రాలలో పెట్రో కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంధన కష్టాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

petro1.jfif

చమురు సంస్థలు సరఫరాలో జాప్యం చేస్తున్న కారణంగానే సమస్య ఏర్పడిందని డీలర్లు చెపుతుండటం తెలుగు రాష్ట్రాలలో పెట్రో కష్టాలకు కారణమవుతుంది. అవసరమైన స్థాయిలో ట్యాంకర్లు రాకపోవడంతో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని పేర్కొంటున్నారు. నిల్వలు లేకపోవడంతోనే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని పలువురు బంకు యజమానులు వెల్లడించారు.

petro5.jfif

మరోవైపు సమస్యను త్వరగా పరిష్కరించి సాధారణ సరఫరా పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రో కష్టాలపై తక్షణమే స్పందించకపోతే రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధన సరఫరా సక్రమంగా లేకపోతే రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

petro.jfif