విశాఖ జూకు నాలుగు దశాబ్దాల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఒక అరుదైన అతిథి వచ్చింది. మెరిసే కళ్లు, నిగనిగలాడే నల్లటి శరీరంతో ఘోస్ట్ ఆఫ్ జంగిల్ గా పిలిచే నల్ల చిరుత సందర్శకులను కట్టిపడేస్తోంది. గౌహతిలోని అస్సాం స్టేట్ జూ నుంచి యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా నాలుగేళ్ల వయసున్న ఈ ఆడ చిరుతను విశాఖకు తీసుకువచ్చారు. దీనికి ‘రెజీమా’ అని పేరు పెట్టారు.

ఈ అరుదైన అతిథి సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా రెజీమా డైట్ ప్లాన్ చాలా ప్రత్యేకం.దీనికి ప్రతిరోజూ ఉదయం ఒక కిలో చికెన్, మధ్యాహ్నం 2 నుంచి 3 కిలోల వరకు బీఫ్‌ను ఆహారంగా అందిస్తున్నారు. ఈ అరుదైన జీవిని చూసేందుకు జూకు సందర్శకులు పోటెత్తుతున్నారు










