9630 వార్తలు




హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. కెకెఆర్ పై డిసి 40 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఆర్ సిబి 18 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా నెట్ రన్ రేటు ఆధారంగా వరసగా జిటి, ఎస్ఆర్ హెచ్ జట్లు ఉన్నాయి. ఆర్ఆర్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర పటేల్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో నలుగురు బ్యాట్స్ మెన్లు అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో ఆ జట్టే ఐపిఎల్ కప్పు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు. హెన్రీచ్ క్లాసెన్ 606 పరుగులు, ఇషాన్ కిషన్ 566, అభిషేక్ శర్మ 563 పరుగులతో ఫామ్ లో ఉన్నారని తెలియజేశారు. ఆర్ సిబితో జరిగిన మ్యాచ్ లో ముగ్గురు బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 255 పరుగులు చేసిన విషయం తెలిసిందేన్నారు. ఎస్ఆర్ హెచ్ లో ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడని, అతడు ఫామ్ లోకి వస్తే ఆపడం ఎవరు తరం కాదని పటేల్ పేర్కొన్నాడు. పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుకు అదనపు బలం అని కొనియాడారు. ఎస్ఆర్ హెచ్ అడ్డుకోవడం కష్టమేనని



విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతుందని.. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి ప్రీతి ముకుందన్‌ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ముకుందన్. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్‌లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్‌గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ పాత్ర, లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒకరు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా క్లీనర్ జనార్థన్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామి గ్రామానికి చెందిన కిరణ్(35)గా గుర్తించారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో పోలేకమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోధుమల లోడుతో వెళ్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కిరణ్ సజీవ దహనమయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. The post ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం appeared first on Navatelangana.

యి సంగ్ (1910-1937)కొరియా సియోల్ లో జన్మించాడు. అసలు పేరు, కిమ్ హేక్యోంగ్. వాస్తుశాస్త్రంలో పట్టా పొందాడు. కొరియాను, జపాన్ ఆక్రమించిన సమయంలో జీవించాడు. కొరియా, జపాన్ రెండు భాషలలోనూ ప్రవీణుడు. ముఖ్యమైన కొరియా ఆధునిక రచయితలలో ఒకడు. కవిత్వం, కల్పన రెండింటినీ రాశాడు. వాటిల్లో ఎక్కువ భాగం అవాస్తవికత, కారణంగా అతని రచనలు చాలా మంది పాఠకులను అయోమయంలో పడేశాయి. విశ్లేషకులను గందరగోళానికి గురిచేశాయి. అయినా, అతని రచనలు ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ సాహిత్యంలో జరిగిన సాహిత్య ప్రయోగాలు. సాహసోపేతమైనవి అసాధారణంగా ఆకర్షణీయమైనవి. జపాన్ ఆక్రమణకు, విరుద్ధంగా కొరియా రాజకీయ తిరుగుబాట్ల పరంగా అతని రచనలు ప్రత్యేకం. ఆ కారణంగానే అతనిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్‌లోనే మరణించాడు. అతని మరణానంతర రచనలు ‘collected works of Yi sang’ పేరుతో 1956లో మూడు సంపుటాలుగా వచ్చాయి.అందులోని అతని రచనలు ఆధునిక కొరియా సాహిత్యపు గొప్ప విప్లవాత్మక వారసత్వాలలో ఒకటిగా నిలుస్తున్నాయి. యి సంగ్ కొరియా ఆంగ్ల కవితకు అనువాదం - ముకుంద రామారావు

అద్దంలో శబ్దం లేదు మరే ఇతర ప్రపంచమూ అంత నిశ్శబ్దంగా లేదు నా చెవులు అద్దంలో కూడా ఉన్నాయి ఆ చెవులు, నేను చెప్పినవి అర్థం చేసుకోలేవు అద్దంలో నేను ఎడమచేతి వానిని అతనికి నాతో చేతులు కలపడమూ తెలియదు అంగీకరించడు అలా అతనిని అనుభూతి చెందకపోయినా అద్దమే లేకపోతే నేనెలా చూడగలనతనిని ప్రస్తుతానికినా దగ్గర ఏ అద్దమూ లేదు అయినా అతనున్నాడు ఇప్పుడొక్కడే బహుశా కష్టపడుతుండొచ్చు అద్దంలో అతను ఖచ్చితంగా నాకు అభిముఖుడు అయినా నన్నెంతో పోలిఉన్నాడు విషాదం ఒకటే, అతనిని నేను పరిక్షించనూలేను సాయపడనూలేను- ముకుంద రామారావు

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి నగర్ లో లక్ష్మి గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. గుడికి ఆనుకుని ఉన్న ఆక్సిజన్ పార్కు నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలోనికి ప్రవేశించారు. గుడిలోని హుండీతో సహా గర్భ గుడిలోని నగలను అపహరించారు. అనంతరం దొంగలు హుండీని పార్కులో వదిలి పారిపోయారు. సోమవారం ఉదయం అర్చకులు వచ్చి చూసేసరికి గుడి తాళాలు తెరిచిఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

పిలుస్తున్నావనే ఇంకా నా కళ్ళు చెవులు రిక్కించి చూస్తున్నవి నీ మాటలు లేకుండా బతుకు ఖాళీ గదిలా అయ్యింది నువ్వేమో పోకడలను శిరస్సు స్కంధాలపై మోస్తూ పోతున్నావు ఎడారి ఒంటెలా మట్టిదిబ్బల గతవర్తమానంలోకాళ్ళీడుస్తూ.. యుద్ధం మెదడును తొలిచేస్తోంది దాన్ని ఆపే యత్నం హృదయంలో కొట్టుకుంటోంది... ఆలోపు జరిగేవన్నీ శరీరమంతా పాకి నిన్నో నిప్పుల కొలిమిలో కూర్చోబెడతాయి నేనింకా అక్కడే ఉన్నా ఎక్కడ మొదలెట్టామో.. నీ వరకు రావడానికి నిన్ను ఆర్పేందుకు నేనిప్పుడు కళ్ళచెమ్మనైనా కూడగట్టుకోవాలి మనం గడిపిన దూరం కాలాల మధ్యలో అల్లాడిన క్షణాలు చాలు ఒక నదిలా నేను మారడానికి నిన్ను ఆలింగనం చేసుకోడానికి... - రఘు వగ్గు

తెలుగు ఉభయ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలో మాట్లాడే జీవన భాష. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా ఎక్కువగా వాడుకలో ఉంది. ఉర్దూ భాష ప్రాముఖ్యం తెలుగు సాహిత్యం పై చెప్పుకోదగ్గదిగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇది మరింత ఎక్కువ. తెలంగాణలోని సామాన్య జనసమూహం ఉర్దూ పదాలను దైనందిన జీవితంలో తరచచు వాడుతుంటారు. వ్యహారిక భాషలో మిళితమైన ఉర్దూ పదాలు తెలంగాణ సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్దాక కవితలు, కథలు, నవలలు, జానపద పాటలలో, తెలంగాణ నేపథ్యం గల సినిమాలలో మరింత ఎక్కువగా చోటుచేసుకున్నాయి.మిర్జా గాలీబ్ కవిత్వాన్ని తెలుగులో దాశరథి క్రిష్ణమచార్య గారు ‘గాలిబ్ గీతాలు’ గా అనువాదించారు. ఉదాహరణకు : నేను మరణించిన నా ఇంటిలోన మిగిలె/ప్రియసీ చిత్ర పటములు లేఖలంతె(A few images and a few letters from sweet hearts/Those were the things found at home after my death) ప్రతిది సులభమ్ముగా సాధ్య పడదు లెమ్ము/నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము. (It is impossible that every work is easy/For a man to become a man is not at all easy)మఖ్దూమ్ మొహియొద్దీన్ ఉర్దూలో రాసిన కొన్ని పాటలను దాశరథి, గజ్జల మల్లారెడ్డి, సి.నారాయ

నవతెంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రూ.9,968 కోట్లను నిర్దేశించింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, […] The post గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ appeared first on Navatelangana.


నేను నా సాహితీ యాత్ర: వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. చిన్నప్పుడు దాదాపు అన్ని రకాల వ్యవసాయ పనులు చేసేవాడిని. మా ఊరు కృష్ణా నదికి మూడు కి.మీల దూరంలోనే ఉన్నప్పటికీ, మాకు నీటి సౌకర్యం ఉండేది కాదు. వ్యవసాయం మొత్తం వర్షాధారమే. అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. అపరాలు, ప్రత్తి, మిర్చి, పొగాకు లాంటి పంటలు పండించే వాళ్ళం. లాటరీ లాంటి వ్యవసాయం. మా ఊరు నుంచి తుళ్లూరు నాలుగు కి.మీలు రోజూ నడుచుకుంటూ వెళ్లి హైస్కూల్ వరకు తాడికొండలో ఇంటర్ చదివాను. ఇంటర్ తప్పడంతో కొంతకాలం పూర్తిగా వ్యవసాయంలోనే మునిగి పోవాల్సి వచ్చింది. ఏ కష్టం ఎలా ఉన్నా, అమ్మా,నాన్న నన్ను ఎలాగైనా చదివించాలని తపనపడ్డారు. అప్పటికి మా నాన్నకు తెలిసిన చదువు అంటే బి ఏ మాత్రమే. అందుకే నన్ను హెచ్. ఈ. సి. గ్రూపులో చేర్పించాడు. ఇంటర్ పాస్ అయిన తర్వాత, గుంటూరు జే కే సి కాలేజీలో బి ఏలో చేరాను.స్కూల్లోనూ, ఇంటర్‌లోనూ సాహిత్యం పట్ల కొంత అభిరుచి ఉండేది. అప్పట్లో యండమూరి, యుద్ధనపూడి, సూర్యదేవర లాంటి వాళ్ల రచనలు, మధుబాబు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివేవాడిని. ఆ ప్రభావంతో ఇంటర్‌లో ఉన్నప్పుడే మూడు నాలుగు కథలు రాశాను కానీ, అవి పత్రికల నుండి చక్కగా తిర

నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని మహాబేశ్వర్-పోలాద్పూర్ మార్గంలో అంబెనాలి ఘాట్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ‘సహ్యాద్రి వన్యజీవ రక్షణ సంస్థ’, స్థానిక రెస్క్యూ టీమ్స్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. The post లోయలో పడిన స్కార్పియో.. 8 మంది మృతి appeared first on Navatelangana.



