యి సంగ్ (1910-1937)కొరియా సియోల్ లో జన్మించాడు. అసలు పేరు, కిమ్ హేక్యోంగ్. వాస్తుశాస్త్రంలో పట్టా పొందాడు. కొరియాను, జపాన్ ఆక్రమించిన సమయంలో జీవించాడు. కొరియా, జపాన్ రెండు భాషలలోనూ ప్రవీణుడు. ముఖ్యమైన కొరియా ఆధునిక రచయితలలో ఒకడు. కవిత్వం, కల్పన రెండింటినీ రాశాడు. వాటిల్లో ఎక్కువ భాగం అవాస్తవికత, కారణంగా అతని రచనలు చాలా మంది పాఠకులను అయోమయంలో పడేశాయి. విశ్లేషకులను గందరగోళానికి గురిచేశాయి. అయినా, అతని రచనలు ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ సాహిత్యంలో జరిగిన సాహిత్య ప్రయోగాలు. సాహసోపేతమైనవి అసాధారణంగా ఆకర్షణీయమైనవి. జపాన్ ఆక్రమణకు, విరుద్ధంగా కొరియా రాజకీయ తిరుగుబాట్ల పరంగా అతని రచనలు ప్రత్యేకం. ఆ కారణంగానే అతనిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్‌లోనే మరణించాడు. అతని మరణానంతర రచనలు ‘collected works of Yi sang’ పేరుతో 1956లో మూడు సంపుటాలుగా వచ్చాయి.అందులోని అతని రచనలు ఆధునిక కొరియా సాహిత్యపు గొప్ప విప్లవాత్మక వారసత్వాలలో ఒకటిగా నిలుస్తున్నాయి.

యి సంగ్ కొరియా ఆంగ్ల కవితకు అనువాదం - ముకుంద రామారావు