
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతుందని.. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి ప్రీతి ముకుందన్‌ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ముకుందన్. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్‌లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్‌గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ పాత్ర, లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.











