టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె తాజాగా తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. తాజాగా మరో సినిమా ఒప్పుకొంది. ఈ కొత్తగా ఒప్పుకున్న చిత్రం సితార బ్యానర్ తీస్తున్న సినిమా. మీనాక్షి ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువ చిత్రాలు సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించినవే ఎక్కువ. గుంటూరు కారం (సితార మాతృ సంస్థ హారిక హాసిని నిర్మించింది), లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు, ఇవన్నీ ఆ బ్యానర్ చిత్రాలే. తాజాగా కార్తీ హీరోగా దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో (మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల దర్శకుడు) ఈ సంస్థ తీస్తున్న కొత్త చిత్రంలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్. అంటే ఈ బ్యానర్‌లో ఆమెకి ఇది నాలుగో చిత్రం.