న్యూఢిల్లీ :  పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర 113.74 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర 104.88 గా ఉంది. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ రూ.5 పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావంతో తిరిగి ఇప్పుడు ధరను పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం తరువాత పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం ఇప్పుడు ఇంధన వినియోగదారులపై పడింది. మే 18న పెట్రోల్‌పై 0.86 పైసలు, డీజిల్‌పై 0.83 పైసలు, మే 22న పెట్రోలుపై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 91 పైసలు పెంచారు. పది రోజుల క్రితమే దేశంలో పెట్రోలు, డీజిల్‌పై లీటరు కు మూడు రూపాయలు చొప్పున ధరలు పెంచిన విషయం తెలిసిందే.