అద్దంలో శబ్దం లేదు

మరే ఇతర ప్రపంచమూ

అంత నిశ్శబ్దంగా లేదు

నా చెవులు అద్దంలో కూడా ఉన్నాయి

ఆ చెవులు, నేను చెప్పినవి

అర్థం చేసుకోలేవు

అద్దంలో నేను ఎడమచేతి వానిని

అతనికి నాతో చేతులు కలపడమూ

తెలియదు అంగీకరించడు

అలా అతనిని అనుభూతి

చెందకపోయినా అద్దమే లేకపోతే

నేనెలా చూడగలనతనిని

ప్రస్తుతానికినా దగ్గర

ఏ అద్దమూ లేదు

అయినా అతనున్నాడు

ఇప్పుడొక్కడే

బహుశా కష్టపడుతుండొచ్చు

అద్దంలో అతను ఖచ్చితంగా నాకు అభిముఖుడు

అయినా నన్నెంతో పోలిఉన్నాడు

విషాదం ఒకటే, అతనిని

నేను పరిక్షించనూలేను

సాయపడనూలేను

- ముకుంద రామారావు